పోలీస్ అంటే ఒక రక్షణ, భద్రత : కలెక్టర్ శ్యాంప్రసాద్
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నక్సలిజం, మాఫియా రూపుమాపడంలో పోలీసులది కీలకపాత్ర అని కొనియాడారు. పోలీస్ అంటే ఒక రక్షణ, భద్రత అన్నారు. విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ, ప్రజలతో న్యాయంగా స్నేహపూర్వకంగా నడుచుకునేలా వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు.