నిర్మల్: జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం ఏర్పాటు.. రక్తదానం చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
Nirmal, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెందుతుందన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోదీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.