రాయదుర్గం: పట్టణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని నేతాజీ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంత బాబు తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తో కలసి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. పాత రేషన్ కార్డుల స్థానంలో ప్రవేశ పెట్టిన వీటిని లభ్థదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. పస్తులు లేని ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని అన్నారు.