ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం ఉద్యోగులను వాడుకొని వదిలేశారు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Proddatur, YSR | Sep 16, 2025 ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం వాడుకొని వదిలేసిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ ఉద్యోగులకు అమలు కాని ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. ఆ హామీలను నమ్మి 70 శాతం మందికిపైగా ఉద్యోగులు కూటమి పార్టీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు.