మంత్రాలయం: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నేరేడు ఉద్యోగ భృతి 3000 ఇవ్వాలి: ఏఐఎస్ఎఫ్
మంత్రాలయం:రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత సమస్యల గురించి చర్చించాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రాజు అన్నారు. రాష్ట్ర సమితి పిలుపుమేరకు మంగళవారం మంత్రాలయం ఎమ్మార్వో రమాదేవికి యువతకు సంబంధించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి రూ.3000 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.