ములుగు: జిల్లా కేంద్రంలో అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు
Mulug, Mulugu | Sep 15, 2025 ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యాబోధన అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలని, ఫేస్ క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంత్రుల క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా నేడు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ములుగు బస్టాండ్ నుండి మంత్రి కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న అంగన్వాడీలను మిషన్ భగీరథ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా అంగన్వాడీలు ఎర్రటి ఎండలో నడిరోడ్డు మీద బైఠాయించారు. దీంతో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం మంత్రిగారితో మాట్లాడిస్తామని ప్రస్తుతం పీఏకు వినతిపత్రం ఇవ్వండి అని ప