గిద్దలూరు: రాచర్ల మండలంలో గొర్రెల కాపరులకు గొర్రెల సస్య రక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన పశువైద్య శాఖ అధికారులు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గొర్రెల కాపరులకు గొర్రెలలో ఏర్పడే వ్యాధులను వాటి నివారణ కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రాచర్ల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు వెల్లడించారు. ఆత్మ కార్యక్రమంలో భాగంగా వాణి, రిసోర్స్ పర్సన్ శ్రావణ్ కుమార్ కార్యక్రమానికి హాజరై గొర్రెల కాపరులకు గొర్రెల సస్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గొర్రెలకు ఏర్పడే జబ్బుల పై వివరించి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి మందులు వాడాలో వారికి తెలియజేయడం జరిగిందన్నారు.