సత్వరమే సమస్యలను పరిష్కరించాలి
: జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ద్వారా అందిన వినతులు సత్వరమే పరిష్కారం కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్దిలతో కలిసి జేసీ జిల్లాలోని ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు.