శంకరంపేట ఏ: పెద్ద శంకరంపేట మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న మహిళలు
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పట్టణంతో పాటు మండలంలోని బద్దారం, మల్కాపూర్, గొట్టిముక్కుల గ్రామాలకు గత 20 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని బుధవారం మహిళలు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.