నూనె వాండ్ల పల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గార్గేయ నది, ఏరు దాటకూడదని సూచికలు ఏర్పాటు చేసిన అధికారులు
నూనె వాండ్లపల్లి వద్ద గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు ఆదివారం సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బాలంవారిపల్లి వద్ద గల ప్రాజెక్టుకు ఎగువన గల ఒక చెరువు తెగి మొరవ ద్వారా నిండి పీలేరు మండలం పీలేరు సదుం మార్గంలోని దొడ్డిపల్లి పంచాయతీలోని శివరాం పురం సమీపంలోని నూనె వాండ్లపల్లి నుంచి అగ్రహారం వెల్లే మార్గంలో గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.పీలేరు రెవిన్యూ అధికారులు ఉదృతంగా ప్రవహిస్తున్న రోడ్డుకు ఇరువైపులా ముళ్లకంచెలు వేసి బోర్డులు ఏర్పాటు చేసి ఎవరు ఏరు దాటకూడదని,ఏటిలో ఆవులు కడిగేందుకు వెళ్ళరాదన్నారు