పులివెందుల: కడప - రాయచోటి - మదనపల్లి - బెంగళూరు రైల్వే లైన్ మాటేమిటి? : వేంపల్లి లో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి
Pulivendla, YSR | Oct 24, 2025 2,056 కోట్ల రూపాయల అంచనా తో 110 కిలోమీటర్ల మేర ముద్దనూరు -- పులివెందుల -- ముదిగుబ్బ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం తెలపడం పట్ల రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కడప - రాయచోటి - మదనపల్లి -- బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం మాటేమిటని తులసిరెడ్డి ప్రశ్నించారు.