అసిఫాబాద్: ఆసిఫాబాద్ లో మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత: సీఐ బాలాజీ వరప్రసాద్
ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తుంపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లను పట్టుకొని వాటిని పోలీస్టే స్టేషన్ తరలించి ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.