ఓబులాపురం మైనింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలి : బీ.ఎస్.పి నాయకుడు చిందనూరు నాగరాజు
Anantapur Urban, Anantapur | Sep 28, 2025
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం లో ఉన్న ఓబులాపురం మైనింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని భారతీయ సమాజ్వాది పార్టీ నాయకుడు చిందనూరు నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఓబులాపురం మైనింగ్ ద్వారా ప్రభుత్వాలకు అతీతంగా దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. సిబిఐ సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.