పలమనేరు: టీచర్స్ టోర్నమెంట్ను ప్రారంభించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, విద్యార్థులను ఉద్దేశించి కీలక విషయాలు వెల్లడించారు.
పలమనేరు: పట్టణ విద్యాశాఖ అధికారిని లీలారాణి మీడియాకు తెలిపిన సమాచారం మేరకు.టీచర్స్ టోర్నమెంట్ ను చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు పలు కీలక విషయాలు ఆయన తెలిపారు. ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి, మానసికంగా, శారీరకంగా ఉత్సాహపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తోందన్నారు. మండల స్థాయి, డివిజన్, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో ఈ గేమ్స్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఇఓ లీలారాణీ తదితరులు పాల్గొన్నారు.