మెదక్: మండల కేంద్రంలోని మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో
Medak, Medak | Sep 15, 2025 చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం లోని దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. వికలాంగుల పెన్షన్ ను ఆరువేలకు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రెడ్డి గోపాల్ మాట్లాడుతూ వితంతు పెన్షన్ రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హమిలు నెరవేర్చాలని అన్నారు.