గాండ్లపెంట లోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లాజర్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లాజర్, డివైఈవో జాన్ రెడ్డప్ప లు పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, వారికి మంచినీరు, బెంచులు, వెలుతురు, ఫ్యాన్లు ఉండే విధంగా చూసుకోవాలని స్థానిక ఎంఈఓ, హెచ్ఎం లకు ఆదేశించారు