ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం
* వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణాజీ
ఉత్తమ పౌరు సమాజ నిర్మాణమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని ఆ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణాజీ అన్నారు. సోమవారం పార్వతీపురంలోని ఆర్కే జూనియర్ కళాశాల, జనహత డిగ్రీ కళాశాలలో ఆ వేదిక జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణాజీ విద్యార్థులతో మాట్లాడుతూ రానున్న సమాజమంతా ఉత్తమ పౌరులతో నిండి ఉండాలన్న సంకల్పంతో జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుందన్నారు. ప్రజల కోసం సైన్స్... ప్రగతి కోసం సైన్స్ అనే నినాదంతో మూఢాచారాలు మూఢనమ్మకాల స్థానంలో సైన్స్ ను సద్వినియోగ పరచాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువుల మాటలు ఆచరించాలన్నారు.