సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సచివాలయం వద్ద ఆదివారం 10:30 సమయంలో పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోలియోను నివారించేందుకు ఐదేళ్ల లోపల చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల భవిష్యత్తులో పోలియో వ్యాధి రాకుండా నివారించవచ్చని అందుకు తల్లిదండ్రులంతా సహకరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బంది స్థానిక టిడిపి నేతలు అంతా పాల్గొన్నారు.