పరిగి: పర్యావరణానికి హాని కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
పర్యావరణానికి హాని కలవకుండా రోడ్డు విస్తరణ- ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మించబోయే నేషనల్ హైవే పనులకు అన్ని అడ్డంకులు తొలగాయని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పనులలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న 950 మర్రి చెట్లలో అన్నింటినీ తొలగించకుండా,కేవలం రెడ్ మార్క్ వేసిన కొన్ని 150 చెట్లను మాత్రమే తొలగించి,వాటిని వేరే ప్రదేశాల్లో పునర్వనరూపణ చేయనున్నట్లు చెప్పారు.పర్యావరణానికి ఎలాంటి భంగం కలగకుండా,అభివృద్ధి పనులు సమతుల్యంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రోడ్డు ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల