కర్నూలు: రహదారి విస్తరణల్లో బాధితులకు పూర్తి న్యాయం – కమిషనర్ పి. విశ్వనాథ్
నగరంలో సాగుతున్న ఆర్డీపి-2, ఎన్హెచ్–340 సి రహదారి విస్తరణ పనుల్లో భూస్వాములు, భవన యజమానులెవరూ అన్యాయానికి గురికాకుండా పూర్తి పరిహారం కల్పిస్తామని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ హామీ ఇచ్చారు.మంగళవారం జరిగిన సమీక్షలో కిడ్స్ వరల్డ్–బుధవారపేట బ్రిడ్జి వరకు 82 ఆస్తులు, చెక్పోస్ట్–ఎస్ఎస్ గార్డెన్స్ వరకు 201 ఆస్తుల యజమానులతో సమగ్రంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి, పత్రాలు సమర్పించిన వారికి వెంటనే పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.నగరాభివృద్ధికి ప్రజలు స్వచ్ఛంద సహకారం అందించాలని, రహదారి విస్తరణ ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కీలకమని కమిషనర్ పేర్కొన