పలమనేరు: అక్రమ సంబంధంతో భార్య ప్రియుడు కలిసి చంపేయాలనుకున్న ఆర్మీ ఉద్యోగి, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు
పలమనేరు: కోతి గుట్ట గ్రామస్తులు ఆదివారం సాయంత్రం మీడియా తెలిపిన సమాచారం మేరకు. ఆర్మీ ఉద్యోగి సి. వెంకటేశులును తన భార్య శిల్ప ఆమె ప్రియుడు ఎం.వెంకటేష్ కలిసి చంపాలనే కుట్రతో సలసల కాగుతున్న నూనెను పోశారు. పాపం అతను ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చు పెట్టుకుని బతుకు జీవుడా అంటూ కోలుకుంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం వారు హాస్టల్లో చదువుకుంటున్నారు. అక్రమ సంబంధాల వలన పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంది ఇలా చేసేవారికి కఠినంగా శిక్షలు పడాలి మరొకరు ఇలాంటి దుస్సాహసాలకు పాల్ప కుండ పోలీసు వారు చూడాలని కోరారు.