మంత్రాలయం: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హనుమాపురం టిడిపి గ్రామ నాయకున్ని పరామర్శించిన మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణా రెడ్డి
పెద్ద కడబూరు:హనుమపురం టీడీపీ గ్రామ నాయకుడు ఈరన్న అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి ఆదివారం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.పార్టీ పట్ల కష్టకాలంలో కూడా అంకితభావంతో ఉన్న నాయకులను ఆదుకోవడం మా బాధ్యత ఆయన అన్నారు. డాక్టర్లను ఈరన్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.