1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీనం సందర్భంగా బుధవారం ధూల్ మిట్ట మండలం వీర బైరాన్ పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి నెత్తురు పారిన నేల రజాకారుల ఆగడాలను అడ్డుకున్నందుకు అట్టుడికిన ఊరు బైరాన్ పల్లి అన్నారు. రజాకార్లను బైరాన్ పల్లి రక్షక దళాలు తరిమికొట్టాయని తెలిపారు. 1948 ఆగస్టు 27 అర్ధరాత్రి సుమారు 1200 మంది రజ