గిద్దలూరు: కంభం పరిసర ప్రాంతాలలో వైరల్ ఫీవర్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, అప్రమత్తంగా ఉండాలంటున్నా మెడికల్ ఆఫీసర్
ప్రకాశం జిల్లా కంభం పరిసర ప్రాంతాలలో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ప్రజలు జాగ్రత్త పడాలని కంభం ప్రభుత్వాసుపత్రి మెడికల్ ఆఫీసర్ శిరీష ప్రియదర్శిని బుధవారం తెలిపారు. విష జ్వరాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకొని ఇలా చూసుకోవాలన్నారు. ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు అన్నారు.