కళత్తూరు గ్రామంలో వరద ముంపుతో 15 లక్షలు ఆస్తి నష్టపోయాం పాడి రైతు ఆవేదన
వరద ముంపుతో రూ.15 లక్షలు ఆస్తి నష్టపోయాం : పాడి రైతు కేవీబీ పురం మండలంలో వరద కారణంగా కలత్తూరులో భారీ ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. తన ఇంటిలో వంట పాత్రలతో పాటు 19 బర్రెలు నీటి ప్రవాహంలో చనిపోయాయని బాధితుడు వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క పాడి గేదె ఖరీదు రూ.70 వేలు ఉంటుందన్నారు. రూ.40 వేలు విలువైన 2 బైకులు కొట్టుకుపోయాయన్నారు. పశువులు పోగొట్టుకోవడంతో తమ జీవనోపాధిని కోల్పోయామన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.