తాండూరు: బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ లైన్ 1098 కు సమాచారం అందించాలి: ఎస్సై పుష్పలత
రాష్ట్రంలో అత్యధిక మైనర్ బాలికలు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుందని తాండూర్ ఎస్సై పుష్పలత అన్నారు సోమవారం తాండూర్ లోని ఎస్టీ మార్క్స్ హైస్కూల్లో ఫోక్సో కేసులు మరి బాలికల మిస్సింగ్ కేసులు తగ్గిద్దాం అని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కళాబృందం ఇంచాల్ అశోక్ వారి టీం సబ్ డివిజన్ సి టీం ఇన్చార్జి శేఖర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు లోపల ఉన్న బాలికలు తమంతట తాము వెళ్ళిపోయినా లేదా ఎవరైనా వారిని అపహరించిన దానికి కారణమైన నేరస్తుడిపై ఫోక్సో కేసు నమోదు అవుతుందన్నారు