నారాయణపేట్: దసరా పండుగను పురస్కరించుకొని ఆత్మకూరు మండలంలో పలు ఆలయాలను సందర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు
మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహా మంగళ హారతులు చేశారు. నిర్వాహకులు వారిని సాల్వతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.