బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్తగా ఆల్ప పీఠభూమి ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో 17 18 తేదీలలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. అయితే గురువారం నుంచే నెల్లూరులో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి నెల్లూరులోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. చలిగాలులు పెరుగుతున్నాయి. మరోసారి జిల్లాకు వర్షాలు తప్పవని హెచ్చరికల నేపథ్యంలో వరుణ దేవా మమ్మల్ని బ్రతకనివ్వవా అంటూ జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.