భక్తులు లేక నిర్మానుషంగా మహానంది క్షేత్రం
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
కార్తీక మాసం నిత్యం భక్తులతో కళకళలాడాల్సిన మహానంది ఆలయ ప్రాంగణాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. అందులో భాగంగా బుధవారం మహానంది ఆలయ ప్రాంగణాలు నిర్మానుష్యంగా కనిపించాయి. వచ్చిన కొద్దిపాటి భక్తులు శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారికి ఉదయం అర్చకులు అష్టవిధ మహా మంగళ హారతులు, స్థానిక అభిషేక, అర్చనలు చేశారు.