మీకోసం అర్చలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారం అందించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Mar 30, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రమేష్, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.