గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాము: ఏపీ గిరిజన సమైక్య సహాయ కార్యదర్శి శ్రీను నాయక్
గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీ గిరిజన సమాఖ్య సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ హెచ్చరించారు. బుధవారం చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో గిరిజన గురుకుల ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో 1700 మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారని, వారిని తొలగించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మంత్రి సంధ్యా రాణి ఉపాధ్యా యుల సమస్యలను ఏ ఒక్కదాన్నీ పరిష్కరించలేదని మండిపడ్డారు.