హత్యారాలలో పొట్టెత్తిన భక్తులు పిండ ప్రధానం చేసిన భక్తులు
రాజంపేట మండలం హత్యరాల బహుద నది వద్ద పితృదేవత లకు తర్పణాలు వదలడానికి జనాలు పొట్టెత్తారు. ఆదివారం అమావాస్య రోజు తర్పణాలు వదిలితే మేలు జరుగుతుందని అందరి విశ్వాసం. ఈ క్రమంలో కొందరు నదిలో స్నానం చేసి పూజలు చేశారు. కొంతమంది అన్నదానం,వస్త్ర దానం చేశారు. మరికొందరు కాకులు ఆవులు చీమలకు ఆహారం పెట్టి పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శ్రీ కామాక్షి త్రేత్రేశ్వర స్వామి దర్శించుకున్నారు.