శామీర్పేట: నారపల్లి లో భారీగా ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల బోడుప్పల్ మార్గంలో నారపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నారపల్లి ప్రాథమిక పాఠశాల ఎదురుగా వరంగల్ హైవేపై రోడ్డు గుంతల మయంగా మారడంతో వాహన రాకపోకలు నిలిచాయి. దీంతో పాటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారింది వాహనాలు రోడ్డుపై మెల్లగా ముందుకు కదులుతున్నాయని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్నారు.