రేపు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : సీఐ ఏవి రమణ
రేపు పోలీసు శాఖ అధ్వర్యంలో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వెంకటగిరి సీఐ ఏవీ రమణ తెలిపారు. ఈ నెల 21 నుంచి వారం రోజులపాటు పోలీసుల అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఎక్కువమంది హాజరై రక్త దానం చేయవలసిందిగా కోరారు. రక్తదానం చేసి పదిమంది ప్రాణాలు కాపాడాలని చెప్పారు.