కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తూ ఉన్నారని.. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటూ.. పోలీస్ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. విడవలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటి మీద దాడి జరిగితే.. ఆధారాలతో సహా కేసు పెట్టినా.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు