నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి మొట్టమొదటిసారిగా రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి మంత్రులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు బుధవారం రాత్రికి పూర్తి చేశారు. మొట్ట మొదటిసారి శ్రీశైల క్షేత్రానికి రానున్న ప్రధాని మోడీకి పదివేల మంది మహిళలతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశైలం నియోజకవర్గం నుండి కాకుండా ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మోడీని చూసేందుకు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో సుమారు 1800 మంది పోలీసులతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట