ప్యాపిలి పశు వైద్యశాలలు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి
Dhone, Nandyal | Sep 16, 2025 నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణ పశువైద్యశాలలో మంగళవారం గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ప్రధాన భూమిక వహిస్తుందని, పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గాలికుంటు వ్యాధి నిర్మూలన కోసం ఈ టీకా కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని, ప్రతి రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.