జమ్మలమడుగు: బద్వేల్ : ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి - తెదేపా ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు మహబూబ్ భాషా
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవని తెదేపా పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు మహబూబ్ భాషా తెలిపారు.కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 23వ వార్డులో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పిఆర్పి భాష, జహంగీర్ భాష, హబీబ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.