పుట్టపర్తిలో రూ.18,61,000ల విలువైన చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 12 మందికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. బుధవారం మధ్యాహ్నం వారి స్వగృహంలో రూ. 18,61,000ల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ అందేలా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.