నిర్మల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Sep 16, 2025 ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన చికిత్సను అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా శక్తి ఆధ్వర్యంలో నడిపిస్తున్న క్యాంటిన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రికి ప్రసవాల కోసం, గర్భస్థ చికిత్సల కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. సరిపడినన్ని బెడ్లు, మందులు, ఇతర వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగ