ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస్ మార్కాపురం జిల్లా ఏర్పాటు పై పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గం లేకుండా వెనుకబడిన ఎలాంటి ఆదాయం లేని నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లా చేయడం సరైనది కాదన్నారు. దర్శి నియోజకవర్గాన్ని కూడా మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు.