గుంతకల్లు: గుత్తి మండలం కొత్తపేట శివారులో కారును వెనుక నుంచి ఢీ కొన్న ఆర్టీసీ బస్సు, తప్పిన ప్రమాదం, ప్రయాణికులు సురక్షితం
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం కారును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం కొత్తపేట శివారులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కారు వెళ్తోంది. అయితే కర్నూలు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి కారును వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో కారు వెనుక అద్దం పగిలి పోగా, డిక్కీ డోరు ధ్వంసం అయింది. తృటిలో పెను ప్రమాదం తప్పి కారులో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు