తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో రోడ్డు ప్రమాదం, బైకర్ ప్రమాదవశాత్తు లారీ కిందపడి మృతి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రి పట్టణంలోని గురు లాడ్జి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామ్మోహన్ రెడ్డి (51) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఆ సమయంలో లారీ వచ్చే అతనిపై దూసుకెళ్లింది. ప్రమాదంలో రామ్మోహన్ రెడ్డి మృతి చెందాడు. ప్రాణం ఉందనే ఆశతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.