పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి: పోతవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణ కోరారు. అంతర్జాతీయ పర్యా వరణ దినోత్సవం సందర్భంగా గురువారం పి.గన్నవరం మండలం పోతవరంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి, ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.