మంత్రాలయం: అమావాస్య సందర్భంగా ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామికి లక్ష పుష్పార్చన
కౌతాళం: మండలంలోని ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామివారికి అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు ఈవో వాణి ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు .