సంక్రాంతి సంబరాల్లో భాగంగా పర్చూరు (మం) అన్నం బొట్లవారి పాలెంలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భారీ బండలను లాగుతూ ఎద్దులు చూపిస్తున్న అపార బలం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. గ్రామీణ సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఈ పోటీలు పండుగ శోభను మరింత పెంచాయి.