కలచెట్ల క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన ప్యాపిలి ఎస్సై మధుసూదన్
Dhone, Nandyal | Sep 17, 2025 ప్యాపిలి మండలం కలచట్ల క్రాస్ రోడ్ వద్ద ఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పద వాహనాలను ఆపి, పత్రాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే కాకుండా, అక్రమ రవాణాను నిరోధించటమే ఈ తనిఖీల ఉద్దేశమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.