అసిఫాబాద్: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తుంది బిజెపి:డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బిజెపి వక్రీకరించి నిజమైన పోరాట చరిత్రను తప్పుదోవ పట్టిస్తోందని DYFI రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. ఆదివారం ASF మలి సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు టికానంద్ అధ్యక్షతన జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కనీసం పాత్ర లేని బిజెపి,కాంగ్రెస్ పార్టీలు విలీనం అని, విమోచనం అని చరిత్రను వక్రీకరించి చెబుతున్నారు.