తాడిపత్రి: యాడికిలో ఆర్ఎంపీ డాక్టర్ శివ శంకరయ్య పై బాధితునితోపాటు బంధువులు దాడికి ప్రయత్నం
యాడికి కి చెందిన శివ శంకరయ్య అనే ఆర్ఎంపీ డాక్టర్ వేసిన ఇంజక్షన్ వికటించిందని రామచంద్రుడు అనే వ్యక్తి మంగళవారం ఆందోళనకు దిగాడు. ఆయన బంధువులతో కలిసి ఆర్ఎంపీ డాక్టర్ పై దాడికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే రెండు నెలల క్రితం కౌలు పల్లికి చెందిన రామచంద్రుడు మోకాళ్ల నొప్పులతో ఆర్ఎంపీ శివ శంకరయ్య వద్దకు వెళ్లాడు.మోకాళ్ళ నొప్పులకు ఇంజక్షన్ వేశాడు.అయితే ఇంజక్షన్ వికటించి కాళ్ళకు బొబ్బలు వచ్చాయని రామచంద్రుడు ఆర్ఎంపీతో వాగ్వాదానికి దిగాడు. బాధితుని బంధువులు ఆర్ఎంపీ పై వాదనకు దిగి దాడికి ప్రయత్నించారు. అయితే చుట్టుపక్కల వారు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.