జగ్గంపేటలో సంకల్ప కార్యక్రమం & పోషణ మహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా స్త్రీ మరియు శిశు అభి వృద్ధి సంస్థ పీడీ ch.లక్ష్మి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాజెక్ట్ సిడిపిఓ ఎమ్. పూర్ణిమ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ, విద్యా శాఖా, ఆరోగ్య శాఖ వారి సంయుక్త సహకారంతో పలు చట్టాలపై, పోషక విలువల పై జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమంను ప్రారంభించినారు.